Share News

తాగునీరు, డ్రైనేజీలకు రూ.118 కోట్లు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:11 AM

Minister Narayana visits diarrhea areas నగరంలో తాగునీరు, డ్రైనే జీ, మురుగునీటి శుద్ధి కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శ్రీకాకుళంలోని దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి తదితర ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

తాగునీరు, డ్రైనేజీలకు రూ.118 కోట్లు
ఆస్ప్రతిలో డయేరియా బాధితులను పరామర్శిస్తున్న మంత్రి నారాయణ

  • భయపడొద్దు.. అండగా ఉంటాం

  • బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది

  • మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ

  • డయేరియా వ్యాప్తి ప్రాంతాల్లో పర్యటన

  • మృతుడు సురేష్‌ కుటుంబానికి భరోసా

  • ఆసుపత్రుల్లో బాధితులకు పరామర్శ

  • అరసవల్లి/అర్బన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో తాగునీరు, డ్రైనే జీ, మురుగునీటి శుద్ధి కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శ్రీకాకుళంలోని దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి తదితర ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. బుధ వారం డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మె ల్యే గొండు శంకర్‌తో కలిసి పర్యటించారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్‌ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం డయేరియా బాధితులతో మాట్లాడారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించా రు. వారి పరిస్థితి ఎలా ఉందని వైద్యుల ను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాల యం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు డయేరియాతో ఒకరు మరణించడం చాలా బాధాకరం. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.10లక్షల పరిహారం చెక్కు అందజేశాం. వారికి అన్ని విఽధాలా అండగా ఉంటాం. నగరంలోని తాగునీటి వ్యవస్థ శాశ్వత పరిష్కారం కోసం రూ.60 కోట్లు కేటాయించాం. డ్రైనేజీ కాలువ ఆధునికీకరణకు రూ.35 కోట్లు, మురుగు నీటి శుద్ధి కోసం రూ.23 కోట్లు కేటాయించాం. దీంతో శ్రీకాకుళంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య తీర నుంది. ఇప్పటివరకు నగరంలో 102 డయేరియా కేసు లు నమోదు కాగా, అందులో కేవలం రెండు కేసుల్లో బాధితులకు డయాలసిస్‌ జరుగుతోంది. బుధవారం 13 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారి పరిస్థితి బాగున్నా సరే 24 గంటలు అదనంగా పరిశీ లనలో ఉంచాలని నిర్ణయించాం. వారంతా ఒకటి, రెం డు రోజుల్లో డిశ్చార్జి కానున్నారు. బాధితులకు ప్రభు త్వం తరపున పూర్తిస్థాయిలో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూనే ఉంద’ని మంత్రి నారాయణ తెలిపా రు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:11 AM