పదోన్నతికి రూ.10 వేలు ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:54 PM
ఓ పీహెచ్‌సీలోని ఎంపీహెచ్‌ఎస్ (ఫిమేల్)కి పదోన్నతి ఇవ్వాలంటే రూ.10వేలు ఇవ్వా లంటూ ఓ మెడికల్ ఆఫీసర్ డిమాండ్ చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఆడియో కలకలం
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓ పీహెచ్‌సీలోని ఎంపీహెచ్‌ఎస్ (ఫిమేల్)కి పదోన్నతి ఇవ్వాలంటే రూ.10వేలు ఇవ్వా లంటూ ఓ మెడికల్ ఆఫీసర్ డిమాండ్ చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పదోన్నతి జాబితాలో ఉందని, ఇందు కు అనుకూలంగా తాను రిపోర్టు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆడియోలో రికార్డు అయింది. అంత ఇచ్చుకోలేనని ఎం పీహెచ్ ఎస్ బతిమలాడినా.. అన్‌ఫిట్ రాస్తే నష్టపోతావని బెదిరించినట్లు అందు లో ఉంది. వివరణ కోరడానికి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులను మంగళవారం రాత్రి ప్రయత్నించినప్పుడు ఎవరూ అందు బాటులో లేరు. ఇది నిజమా? కాదా? అని అధికారులు నిర్ధారించాల్సి ఉంది.