వరి పైరుకు కుళ్లు తెగులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:53 PM
మండలంలోని మర్రివలస, కత్తిరివానిపేట, నగిరికటకం, అచ్యుతాపురం, యలమంచిలి, వెలుసోద, పాగోడు, గుగ్గిలి, తాళ్లవలస, కూర్మనాధపురం ప్రాంతాల్లోని తంపర భూముల్లో పంట పొలాలు నీటమునగడంతో వరిదుబ్బులకు మట్టిపట్టి పంట నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు.
జలుమూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్రివలస, కత్తిరివానిపేట, నగిరికటకం, అచ్యుతాపురం, యలమంచిలి, వెలుసోద, పాగోడు, గుగ్గిలి, తాళ్లవలస, కూర్మనాధపురం ప్రాంతాల్లోని తంపర భూముల్లో పంట పొలాలు నీటమునగడంతో వరిదుబ్బులకు మట్టిపట్టి పంట నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో మునిగిన పంట పొలాల్లో వరి పైరుకు కుళ్లు తెగులు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తంపర పొలాల్లో వరదనీరు చేరి వారం రోజులు నీటిలో మునిగి ఉన్న పంటపొలాల్లో వరి పైరుకు బురద పట్టి కుళ్లు తెగులు సోకిందని పలువురు తెలిపారు. కాగా వరద నీటి ముంపునకు గురైన పంటపొలాల్లో గల వరద బయటకు పంపించే మార్గం ఏర్పాటుచేయాలని ఏవో కె.రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా తెలిపారు. అనంతరం ఆయా పొలాల్లో బూస్టరు డోసు ఎరువులు వేసుకోవాలని కోరారు. ఎకరా పొలానికి 25 కేజీలు యూరియా, 16 నుంచి 20 కేజీలు పొటాష్ బూస్టరు డోస్ ఎరువు వేసుకోవాలని చెప్పారు. కుళ్లు తెగులు నివారణకు ఎక్సు కెనాల్‌జోల్‌ను ఎకరాకు 10 టాంకులు పిచికారి చేయాలని తెలిపారు. వరి దుబ్బు మొదలు తడిచేటట్లు మందును పిచికారి చేయాలని కోరారు.