ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:34 AM
ఎన్నికల నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు కోరారు. గురువారం మునిసిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూము, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో వేణుగోపాలరావు పరిశీలించారు.
ఇచ్ఛాపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు కోరారు. గురువారం మునిసిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూము, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో వేణుగోపాలరావు పరిశీలించారు. ఈవీఎంను భద్రపరిచే గది వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారుల కు సూచించారు. అనంతరం మునిసిపల్ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలిం చారు. నామినేషన్ల ప్రక్రియ నిబందనలు ప్రకారం పారదర్శకం గా నిర్వహించాలని సూచించారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా అవరసమైన ఏర్పాట్లు చేయాలని అదికారు లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వెంకటరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.