ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగి ఇంట్లో చోరీ
ABN , Publish Date - May 18 , 2026 | 12:01 AM
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ రోట రీనగర్ మూడో వీధిలో నివాసముం టున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగి దుర్యోదన ఇంట్లో దొంగలు చొర బడి రూ.50వేల నగదు, 25తులాల వెండి సామగ్రి చోరీ చేశారు.
రూ.50 వేలు నగదు, 20 తులాల వెండి సామగ్రి అపహరణ
పలాస, మే 17 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ రోట రీనగర్ మూడో వీధిలో నివాసముం టున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగి దుర్యోదన ఇంట్లో దొంగలు చొర బడి రూ.50వేల నగదు, 25తులాల వెండి సామగ్రి చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దుర్యోదన ఉద్యోగరీత్యా ఇతర మండలంలో పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో రోటరీనగర్ లో నివాసం ఉంటున్నాడు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో అతడి కుటుంబ మంతా స్వగ్రామానికి వారం రోజుల కిందట వెళ్లారు. ఆదివారం పై ఇంటిలో ని వాసం ఉంటున్న వారు కిందకు వచ్చినప్పుడు చూడగా.. దుర్యోదన ఇంటి తాళా లు పగలగొట్టి ఉండడగాన్ని గుర్తించి అతడికి సమాచారం ఇచ్చారు. దీంతో దుర్యో దన తన ఇంటికి వచ్చి పరిశీలించగా.. 25తులాల వెండి సామగ్రి, రూ.50వేల నగదు అపహరించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి, క్లూస్‌టీమ్ చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా పలాస-కాశీబు గ్గలో వరుసుగా దొంగతనాలు జరుగుతుండడంతో జంట పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.