Share News

గ్రామాల అభివృద్ధికి చిరునామా రోడ్లు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:11 AM

గ్రామాల అభి వృద్ధికి చిరునామా రోడ్లు అని, కూటమి ప్రభుత్వంలో రహ దారుల అభివృద్ధికి ప్రాధా న్యం ఇస్తున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధికి చిరునామా రోడ్లు
రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

గారపేట-పొందూరు బీటీ రోడ్డు ప్రారంభం

పొందూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభి వృద్ధికి చిరునామా రోడ్లు అని, కూటమి ప్రభుత్వంలో రహ దారుల అభివృద్ధికి ప్రాధా న్యం ఇస్తున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. గారపేట నుంచి పొందూరుకు రూ. 1.75 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. గారపేట వాసులు దశాబ్దాలుగా కలలుకంటున్న గారపేట-పొందూరు అడ్డు రోడ్డు నిర్మాణం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూట మి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. రోడ్ల నిర్మాణం జరిగితే ప్రజలు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలు పూర్తిగా కుంటుపడ్డాయన్నారు. కార్య క్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ గణపతిరావు, ఏఈ పీటీ రాజు, ఎంపీడీవో వాసుదేవరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ఏఎం సీ మాజీ చైర్మన్‌ అన్నెపు రాము, తెలుగుయువత జిల్లా ప్రధానకార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, నేతలు బాడాన గిరి, మాజీ సర్పంచ్‌లు ఎ. శ్రీని వాసరావు, సీహెచ్‌ కృష్ణ వాసుదేవరావు తది తరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలిచ్చి వివరించారు.

Updated Date - Aug 12 , 2026 | 12:11 AM