Share News

రోడ్లు అభివృద్ధికి సూచికలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:33 PM

గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే రోడ్లు, గ్రామా ల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం అభివృద్ధికి సూచి కలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

రోడ్లు అభివృద్ధికి సూచికలు
మూడు మర్రిచెట్లు-తండ్యాం రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఎమ్మెల్యే రవికుమార్‌

సీహెచ్‌సీలో అభివృద్ధి పనుల ప్రారంభం

పొందూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే రోడ్లు, గ్రామా ల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం అభివృద్ధికి సూచి కలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. పొందూరు-సర్వేశ్వరపురం వరకు రూ.2.40 కోట్లు, తండ్యాం నుంచి మూడు మర్రిచెట్ల వరకు రూ.1.95 కోట్లు, తండ్యాంనుంచి మంగంపేట వరకు రూ.కోటి, అంబేద్కర్‌ కూడలి నుంచి లుట్టపేట వరకు రూ. 1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో బీటీ రోడ్డు కాదుకదా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీంతో భూము ల విలువ పెరిగి రైతులు లబ్ధిపొందుతున్నారన్నారు. గడచిన రెండేళ్లలో మండలంలో 16 బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.

వైద్య సేవలపై నమ్మకం కలిగించాలి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలపై నమ్మకం కలిగించాలని ఎమ్మెల్యే రవికుమార్‌ అన్నారు. శనివారం సీహెచ్‌సీలో రూ.51 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీహెచ్‌సీలో నాలుగు రోజులుగా డైట్‌ ఇబ్బందులపై సంబం ధిత కాంట్రాక్టర్‌ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పొందూరులో స్వచ్ఛాం ధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా ప్రాథమిక పాఠశాల-1 లో సాసా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. బాలికల వసతి గృహాలను సందర్శించి బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న షూలు, వస్త్రాలను పంపిణీ చేశారు.

కొరమీను చేపలతో ప్రయోజనం

కొరమీను చేపల పెంపకం యూనిట్‌తో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుం దని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. తండ్యాం సమీపంలో కొరమీను చేపల పెంపకం యూనిట్‌ను సందర్శించి చెరువులో చేపలను విడిచి పెట్టారు. కార్యక్రమాల్లో ఆర్‌అండ్‌బీ ఈఈ కేవీ ప్రసాద్‌, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, టీడీపీ నేతలు సీహెచ్‌ రామ్మో హన్‌, అన్నెపు రాము, ఎ.చినరంగ, సీపాన శ్రీరంగ నాయకులు, బలగ శంకర భాస్కర్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో వాసుదేవ రావు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:33 PM