రహదారి భద్రత నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:41 PM
రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని ఏఎస్పీ కేవీ రమణ అన్నా రు.
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని ఏఎస్పీ కేవీ రమణ అన్నా రు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో తన చాంబర్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ రెండు అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. గంజాయి వంటి మత్తు పదా ర్థాలకు అలవాటుపడడం ద్వారా జీవితాలు అంధ కారమవుతాయన్నారు. వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయ న్నారు. రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అధిక వేగం, మద్యం సేవించి వాహ నాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగు తున్నాయన్నారు. వీటిని నియంత్రించడంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. రహదారి భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అన్ని పాఠశా లలు, కళాశాలలు, పబ్లిక్ ప్రదేశాల్లో పోస్టర్లను అతికించి అవ గాహన కలిగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి.రామారావు, జిల్లా డీఆర్‌బీ విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్, సామాజిక కార్యకర్త వంగ పండు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.