Share News

‘ఉపాధి’ నిధులతో ఇంటికి రహదారి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:45 PM

తెలికిపెంట గ్రామ పంచాయతీ ఎల్‌పీఎం అగ్రహారంలోని ఒక ప్రాం తంలో ఉన్న ఒకే ఒక ఇంటికి రోడ్డు నిర్మాణానికి ఉపాధి నిధులు సుమారు రూ.49 వేలు ఖర్చు చేసినట్టు బయటప డింది.

‘ఉపాధి’ నిధులతో ఇంటికి రహదారి
అధికారులకు ఫిర్యాదు చేస్తున్న మూలసవలాపురం వేతనదారులు

సామాజిక తనిఖీలో బయటపడిన వైనం

బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశం

సరుబుజ్జిలి, ఏప్రిల్‌ 18 (ఆంధ్ర జ్యోతి): తెలికిపెంట గ్రామ పంచాయతీ ఎల్‌పీఎం అగ్రహారంలోని ఒక ప్రాం తంలో ఉన్న ఒకే ఒక ఇంటికి రోడ్డు నిర్మాణానికి ఉపాధి నిధులు సుమారు రూ.49 వేలు ఖర్చు చేసినట్టు బయటప డింది. శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణ లో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీఆర్పీలు ఉపాధి నిధు లతో చేపట్టిన పనులు, అక్రమాలు, ఇతర అంశా లను ప్రజావేదికలో వెల్లడించారు. ఓ ఇంటికి నిర్మిం చిన రోడ్డుకు అయిన ఖర్చును సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఫైనాన్స్‌ మేనేజర్‌ ఆర్‌.స్వరూపారాణి, ఏసీడీ లోకేష్‌ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే మండలం లోని వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టగా బోర్డు లు ఏర్పాటు చేయ లేదని గుర్తించారు. వాటి నిధులు తెలియరాలేదని డీఆర్పీ తెలిపారు. అలాగే మూలసవలాపురం గ్రామ పంచా యతీ ఉపాధి హామీ ఆధ్వర్యంలో ఉద్యానవన మొక్కల పెంపకంలో నిర్వహణ లోపం ఉందని సామా జిక తనిఖీ బృందం గుర్తించింది. కొన్ని గ్రామాల్లో మస్తర్లు, రిజిస్టర్లలో దిద్దుబాట్లు చేశారని బృందం వెల్ల డించింది. ఇదిలా ఉండగా సామా జిక తనిఖీ ప్రజావేదిక తూతూ మంత్రంగా జరిగిం దన్న ఆరోపణలు వినిపించాయి. ఉద యం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావేదిక మధ్యాహ్నం 12 గంటలకు ప్రారం భమై గంటలోనే మమ అనిపించి ముగించారు. ఒక్క మూల సవలా పురం నుంచి మాత్రమే వేతనదారులు హాజరు కాగా మిగిలిన 20 పంచా యతీల నుంచి వేతన దారులు రాలేదు. కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్య నారా యణ, ఎంపీడీవో పావని, ఎస్పార్పీ మాధవరావు, పీఆర్‌ జేఈ కూర్మనాథ రావు, ఏపీవోలు పార్వతి, శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:45 PM