Share News

రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:57 PM

ww

రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం
రోడ్డును ప్రారంభిస్తున్న శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి సమస్యలు తగ్గుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. గురు వారం రూరల్‌ మండలం పరిధిలో అలికాం పంచాయతీలో పలు సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 1. 6 కోట్లలో రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ మండలాధ్యక్షుడు ముకాళ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, ఎంపీటీసీ నాగేశ్వరరావు, సర్పంచ్‌ రంది అప్పలస్వామి, ఉపసర్పంచ్‌ ఎద్దుమ సుధాకర్‌, జనసేన రూరల్‌ మండలాఽధ్యక్షుడు కుర్మారావు పాల్గొన్నారు.

ఫ శ్రీకాకుళం అర్బన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని 50వ డివిజన్‌ సీపన్నాయుడిపేటలో రూ.39 లక్షలతో చేపట్టిన కల్వర్టు పనులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ పరిశీలించారు కార్యక్రమంలో సీపాన రాము పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:57 PM