Share News

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:04 AM

తురకపేట జంక్షన్‌ సమీపంలో అలికాం-బత్తిలి ప్ర ధానరోడ్డుపై శుక్ర వారం త్రుటిలో పె ద్ద ప్రమాదం త ప్పింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం
రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు

ఎల్‌ఎన్‌ పేట, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తురకపేట జంక్షన్‌ సమీపంలో అలికాం-బత్తిలి ప్ర ధానరోడ్డుపై శుక్ర వారం త్రుటిలో పె ద్ద ప్రమాదం త ప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలంలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు శ్యామలాపురం జంక్షన్‌ వరకు వచ్చి, తిరిగి కళాశాలకు వెళ్తుంది. తురకపేట జంక్షన్‌ సమీపానికి వచ్చేసరికి ముందువెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు సడన్‌గా రోడ్డుకి అడ్డంగా కుడివైపు తిప్పడంతో బస్సు డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బస్సును ఎడమ వైపునకు తిప్పడంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న చెట్టుకు తగలకుండా బస్సు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో నలుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకరికి బలమైన గాయాలయ్యాయి.

Updated Date - Jan 03 , 2026 | 12:04 AM