Share News

కూటమి విజయాన్ని తట్టుకోలేక అల్లర్లు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:50 PM

ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీలు సాధించిన విజయాలను తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొర్లె కిరణ్‌కుమార్‌ గ్రామాల్లో శాంతిభద్రత లకు విఘాతం కలిగించే చర్యలు చేపడుతున్నా రని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

కూటమి విజయాన్ని తట్టుకోలేక అల్లర్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

మాజీ ఎమ్మెల్యే ‘గొర్లె’వి చిల్లర రాజకీయాలు

ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

రణస్థలం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీలు సాధించిన విజయాలను తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొర్లె కిరణ్‌కుమార్‌ గ్రామాల్లో శాంతిభద్రత లకు విఘాతం కలిగించే చర్యలు చేపడుతున్నా రని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశాంత వాతావర ణంలో బంటుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం అయిందని, అటువంటి గ్రామంలో చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తూ కిరణ్‌కుమార్‌ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. చేత నైతే సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసేందుకు ముందు కు రావాలని, చిల్లరి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ నియోజ కవర్గ ఇన్‌ చార్జి లంక శ్యామలరావు మాట్లాడుతూ.. నియోజ కవర్గంలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉండ గా 65 స్థానాలు కూటమి కైవసం చేసుకుం దన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ఐక్యంగా సాగి విజయ బావుటా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమం లో గొర్లె శ్రీనివాసరావు, నూకరాజు, ముల్లు శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:50 PM