Share News

‘రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలి’

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:21 AM

రిమ్స్‌ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుప త్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీపీఎం, ప్రజా సంఘాల నేత లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రిమ్స్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

‘రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలి’
ధర్నా చేస్తున్న సీపీఎం, ప్రజా సంఘాల నేతలు

శ్రీకాకుళం కల్చ రల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రిమ్స్‌ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుప త్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీపీఎం, ప్రజా సంఘాల నేత లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రిమ్స్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ.. రిమ్స్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంత వరకు అమలు చేయలేద న్నారు. జీజీహెచ్‌ 350 పడకల నుంచి 900 పడకలకు పెరిగినా వైద్యులు, వైద్య సిబ్బం ది పాతవారే ఉన్నారని, పెరిగిన పడకలకు తగ్గట్లు సిబ్బంది నియామకం లేక రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. ఐసీయూలో ఏసీలు పనిచేయడంలేదని ప్రతీబెడ్‌కు వెంటి లేటర్‌ మోనిటర్‌ ఇన్‌ప్యూజన్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఖాళీ లను భర్తీచేసి వైద్యపరికరాలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పి.ప్రసాద్‌, ఎం.సత్యం, కొత్తకోట అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:21 AM