కల్చరల్ మీట్‌లో రిమ్స్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:44 PM
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన అంతర్ కళాశాలల కల్చరల్ మీట్‌లో శ్రీకా కుళం వైద్య కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
శ్రీకాకుళం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన అంతర్ కళాశాలల కల్చరల్ మీట్‌లో శ్రీకా కుళం వైద్య కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇన్‌స్ట్రుమెంట్ మ్యూజిక్ (గిటార్) విభాగంలో తృతీయ సంవత్సరం విద్యార్థి ప్రతీక్‌కుమార్ వర్మ ప్రథమ స్థానం పొందారు. క్విజ్ విభాగంలో తృతీ య సంవత్సరం విద్యార్థులు చక్కా ప్రభవ్, శ్రష్టి శర్మ ప్రథమ బహుమతి సాధించారు. వివిధ అంశాల్లో కళాశాల నుంచి 16 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు మంగళ వారం వైద్యకళాశాల ప్రిస్సిపాల్ ఎస్.అప్పలనాయుడు అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.నాగేంద్రనాయుడు, డా.ఎస్.జ్యోత్న్స, డా.శిరీష, ఫిజికల్ డైరెక్టర్ బి.గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.