Share News

ఇచ్ఛాపురం వైసీపీలో విభేదాలు!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:48 AM

Representation denied for the third time ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని వైసీపీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా యాదవ సామాజికవర్గం నాయకులు లోలోపల రగిలిపోతున్నారు. ఈసారి వైసీపీ నుంచి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా తమ ఇంటి మహిళలను బరిలో దించాలని యాదవ సామాజికవర్గం నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్ఠానం అనూహ్యంగా రెడ్డిక సామాజికవర్గానికి చెందిన పిలక రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేసింది. దీంతో యాదవ సామాజికవర్గానికి చెందిన ఉలాల భారతి దివ్య, డాక్టర్‌ కోదండరావు వంటివారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఇచ్ఛాపురం వైసీపీలో విభేదాలు!

  • మునిపిపల్‌ చైర్‌పర్సన్‌ టిక్కెట్‌ దక్కలేదని యాదవ సామాజికవర్గం ఆవేదన

  • రాజ్యలక్ష్మికి కేటాయింపుపై ఆగ్రహం

  • మూడోసారి దక్కని ప్రాతినిఽథ్యం

  • అధిష్ఠానం తీరుపై అసంతృప్తి

  • నష్టం తప్పదంటున్న విశ్లేషకులు

  • ఇచ్ఛాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని వైసీపీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా యాదవ సామాజికవర్గం నాయకులు లోలోపల రగిలిపోతున్నారు. ఈసారి వైసీపీ నుంచి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా తమ ఇంటి మహిళలను బరిలో దించాలని యాదవ సామాజికవర్గం నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్ఠానం అనూహ్యంగా రెడ్డిక సామాజికవర్గానికి చెందిన పిలక రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేసింది. దీంతో యాదవ సామాజికవర్గానికి చెందిన ఉలాల భారతి దివ్య, డాక్టర్‌ కోదండరావు వంటివారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వాస్తవానికి 2021 మునిసిపల్‌ ఎన్నికల్లోనే రాజలక్ష్మికి చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడాన్ని ఎక్కువ మంది వైసీపీ నేతలు వ్యతిరేకించారు. అంతకు ముందు 2013 మునిసిపల్‌ ఎన్నికల్లో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అందుకే 2021లో యాదవ సామాజికవర్గానికి చెందినవారు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం పదవిలో షేరింగ్‌ అంటే రెండున్నర ఏళ్లయినా ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మూడోసారి సైతం రాజ్యలక్ష్మికి టికెట్‌ ఇవ్వడంతో.. అధిష్ఠానం తీరుపై యాదవ సామాజికవర్గం ఆగ్రహంతో ఉంది.

  • క్రమేపీ తగ్గిన ప్రాధాన్యం

  • వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయలక్ష్మి ఉండేవారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. అయినా సరే ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. కానీ ఉన్నఫలంగా ఆమెను నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించి సాడి శ్యాంప్రసాద్‌రెడ్డికి అప్పగించారు. తాజాగా అదే రెడ్డి సామాజికవర్గానికి చెందిన పిలక రాజ్యలక్ష్మిని ఇచ్ఛాపురం మునిసిపల్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇతర సామాజికవర్గాలు అసంతృప్తి చెందుతున్నాయి. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ వెంట నడిచింది యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నర్తు రామారావుకు టికెట్‌ కేటాయించారు. అటు తరువాత రెండు ఎన్నికల్లో పిరియా సాయిరాజ్‌, ఆయన భార్య విజయలక్ష్మికి టిక్కెట్‌ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్ఛాపురం మునిసిపల్‌ అభ్యర్థిత్వాన్ని యాదవ సామాజికవర్గం కోరుకుంది. కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్థికంగా, సామాజికపరంగా ప్రభావం చూపుతామని ముందుకొచ్చిన యాదవ సామాజికవర్గ నేతలను పక్కనపెట్టారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది వైసీపీకి నష్టం చేకూర్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • ఎచ్చెర్లలోనూ రెండు వర్గాలుగా..

  • ఎచ్చెర్ల రూరల్‌: ఎచ్చెర్ల మండలంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ శుక్రవారం రణస్థలంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయానికి రావాలని కిరణ్‌ కోరారు. అయినా మాజీ ఎంపీపీలు మొదలవలస చిరంజీవి, జనార్దన్‌రెడ్డి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం నుంచి జడ్పీటీసీ అవకాశం ఇవ్వాలని బొడ్డేపల్లి సుధాకర్‌రావు కోరగా, మరోవర్గం నుంచి బోర సాయిరాం ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ అభ్యర్థిగా ఒక వర్గం నుంచి నేతింటి నీలమప్పడు, మరో వర్గం నుంచి జరుగుళ్ల శంకరరావు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం మండలంలో కూటమి బలంగా ఉంది. వైసీపీకి కొన్ని గ్రామాల్లో బలమైన అభ్యర్థులు లభించని పరిస్థితి ఉంది. ఈ నేపఽథ్యంలో గ్రూపులు సమస్యగా మారాయి. మరో పక్క రెండు వర్గాలు మధ్య వ్యక్తిగత కక్షలు కొనసాగుతున్నాయి. దీంతో వైసీపీ వర్గపోరు ప్రభావం స్థానిక ఎన్నికల్లో ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.

Updated Date - Oct 17 , 2026 | 12:48 AM