13 నుంచి రెవెన్యూ క్రీడలు: ఆర్డీవో
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:00 AM
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్టు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.
టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్టు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు నిర్వహణ, కల్చరల్ ఈవెంట్స్‌పై సమీక్షించారు. జిల్లా కేంద్రంలో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో ఈ రెవెన్యూ క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. పెద్ద ఎత్తున ఆయా మండలాల నుంచి క్రీడాకారులు ఈ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే టట్లు చూడాలని రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ క్రీడలు. స్నేహ భావంతో జరిగేటట్లు చూడాలని ఆర్డీవో వారికి దిశా నిర్దేశించారు. ఆర్డీవోను కలిసిన వారిలో డీవీఎస్‌ఎన్ రాజు, నాయక్, లింగరాజు, రామారావు, నారా యణ, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
‘క్రీడా పోటీలు విజయవంతం చేయాలి’
పలాస రూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో డిప్యూటీ కలెక్ట ర్ కేడర్ స్థాయిలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించనున్న రెవెన్యూ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పలాస రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యుల బృందం కోరారు. ఈ మేరకు గురువారం పలాస ఆర్డీవో వెంకటేష్‌ను కలిసి మాట్లాడారు. ఈ పోటీల్లో పలాస డివిజన్ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని, విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిఽధులు డీవీవీఎస్‌ఎన్ రాజు, నాయక్, లింగరాజు, ఆర్.రామారావు,గిరిరాజు పాల్గొన్నారు.