Share News

నేటినుంచి రెవెన్యూ గ్రామ సభలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:35 PM

జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్త కాల పంపిణీ ప్రక్రియకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటినుంచి రెవెన్యూ గ్రామ సభలు

652 గ్రామాల్లో పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్త కాల పంపిణీ ప్రక్రియకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 652 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2,54,218 మంది రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయ నున్నారు. గ్రామసభల్లో భాగంగా కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో నిర్వహించనున్న సభ లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని రైతులకు పుస్తకా లను అందజేయనున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారని కలెక్టర్‌ పేర్కొన్నారు. కవిటి మండలం భైరిపురం, పలాస మండలం రంగోయి, పాత పట్నం మండలం ఏఎస్‌ కవిటి, నరసన్నపేట నియోజకవర్గంలోని కొల్లివలస, ఆమదాల వలస నియోజకవర్గంలోని వంజంగి, లోలుగు, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పిలి, సతి వాడ, ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని వల్లభరాయుడిపేట గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాస్‌ పుస్తకాల పంపిణీ చేపడతారు.

ఎటువంటి రాజకీయ ముద్రలు లేకుండా..

పాత భూహక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కొత్త పాస్‌పుస్తకాల్లో ఎలాంటి రాజకీయ ముద్రలు లేకుండా కేవలం అధికారిక ప్రభుత్వ చిహ్నంతోనే ముద్రించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌ డేటాతో క్షుణ్ణంగా ధ్రువీకరించిన తరు వాతే అర్హులైన పట్టాదారులకు ఈ పత్రాలు పంపిణీ చేయాలని అధికా రులను ఆదేశిం చారు. పంపిణీ సమయంలో ఏవైనా అభ్యంతరాలు తలెత్తితే వాటిని నమోదు చేసుకుని తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ గ్రామా లకు కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్ణీత వేదికల వద్దకు వచ్చి పాస్‌ పుస్తకాలను తీసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Jan 01 , 2026 | 11:35 PM