డబుల్ ఇంజన్ సర్కార్‌తో పూర్వవైభవం
ABN , Publish Date - May 23 , 2026 | 12:18 AM
Governance towards welfare and development డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆమదాలవలస మునిసిపాలిటీ జగ్గుశాస్ర్తులపేట వద్ద విద్యుత్ ఉపకేంద్రానికి పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి పాలన
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఆమదాలవలస, మే 22(ఆంధ్రజ్యోతి): డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆమదాలవలస మునిసిపాలిటీ జగ్గుశాస్ర్తులపేట వద్ద విద్యుత్ ఉపకేంద్రానికి పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ‘వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల మంజూరుకు కేంద్రం సహకరిస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు దేశవిదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రా ష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా జిల్లాకు అధిక ప్రాధాన్యమిస్తున్నార’ని తెలిపారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ‘ఆమదాలవలస మునిసిపాలిటీలో పెరిగిన విద్యుత్ వినియోగం మేరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 33/11 కేవీ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.3.82 కోట్లు నిధులు మంజూరు చేసింద’ని తెలిపారు. కూటమి పాలనలో చేపడుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా, విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, జనసేన కన్వీనర్ పేడాడ రామ్మోహన్, విద్యుత్ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.