వినతులపై త్వరితగతిన స్పందించండి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:03 AM
ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులపై చట్ట ప్రకారం విచారణ చేప ట్టి త్వరితగతిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులపై చట్ట ప్రకారం విచారణ చేప ట్టి త్వరితగతిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ప్రజల నుంచి 65 ఫిర్యాదు లను స్వీకరించారు. ఫిర్యా దులు పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం: ఏఎస్పీ
శ్రీకాకుళం క్రైం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ప్రాధాన్యం ఇస్తోందని ఏఎస్పీ కేవీ రమణ అన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ట్రాఫిక్ పోలీ స్ సిబ్బంది సంక్షేమానికి అందించిన ప్రత్యేక నిధులతో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదే శాల మేరకు కొనుగోలు చేసిన సామగ్రిని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వాటర్ బాటిళ్లు, క్యాప్స్, సన్ గ్లాసెస్, మాస్క్‌లు, డీహైడ్రేషన్ నివారణకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేస్తు న్నామన్నారు. వీటిని వినియో గించుకుని విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశిం చారు. కార్యక్ర మంలో ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి.రామారావు, ఈటీఆర్‌బీ విభాగం ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.