సమస్యలపై సత్వరం స్పందించండి
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:08 AM
ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చే వినతులపై సంబంధిత అధికా రులు సత్వరం స్పందించాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చే వినతులపై సంబంధిత అధికా రులు సత్వరం స్పందించాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం శ్రీకా కుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో స్వగృహంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌లో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు ఇచ్చే సమస్య లపై కొన్ని శాఖల అధి కారులు పరిష్కరించ కుండా జాప్యం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిం దని, ఇప్పటికైనా వారి పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆమదాల వలస మండలం కొర్లకోటకి చెందిన అంపో లు మీనాకుమారికి, సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామానికి చెందిన కరణం రమా దేవికి మంజూ రైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వర్షం కురుస్తున్నప్పటికీ వారి ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు సనపల అప్పల నాయుడు, అన్నెపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.