‘కార్మికుల సమస్యలు పరిష్కరించండి’
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:26 PM
మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మునిసిపల్ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు డిమాం డ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మునిసిపల్ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు డిమాం డ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఈనెల 20 నుంచి ఆందోళనలు చేపడుతున్నా అధికారులు స్పందించడం లేద న్నారు. మునిసి పల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయిం చాలని, హైకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికు లను పర్మనెంట్ చేయాల న్నారు. మృతి చెందిన, పదవీ విర మణ చేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలన్నారు. గ్రాట్యు టీ సౌకర్యం కల్పించాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వా లని కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే జూలై 7న చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో ఆయా సంఘాల నేతలు నాయకులు గణేష్, గురుమూర్తి, మణి, రామచంద్ర, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.