Share News

అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:56 PM

ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే అర్జీలను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారు లను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 155 అర్జీలను స్వీకరించారు.

అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి
గ్రీవెన్స్‌లో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే అర్జీలను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారు లను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 155 అర్జీలను స్వీకరించారు. ‘శ్రీకూర్మం నుంచి ఎస్‌.మత్స్యలేశం రోడ్డు గోతులమయమెందని తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. జడ్పీ పాత సమావేశ మందిరంలో సోమవారం భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సందర్శించారు. రెవెన్యూ క్లినిక్‌ కౌంటర్లలో సమస్యల పరిష్కారానికి సిబ్బంది తీసుకుంటున్న చర్యలను పరిశీలిం చారు. 60 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆ ర్డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌, ఉప కలెక్టర్‌ పద్మావతి, డీఆర్వో వి.విశ్వేశ్వర రావు పాల్గొన్నారు.

మా భూమిని ఆక్రమించారు

మా భూమిని కౌలు రైతు దౌర్జన్యంగా ఆక్రమించారని, తగు చర్యలు తీసు కుని న్యాయం చేయాలని కోటబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వాహినీపతి, దాసుబాబు రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేశారు. తమకు చెందిన నాలుగున్నర ఎకరాల భూమికి కౌలుకు ఇచ్చామని, సదరు కౌలు రైతు ఇప్పుడు భూమి వద్దకు వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నా డని వాపోయారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, అధి కారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. గతేడాది కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, తహసీల్దాకు సిఫారసు చేశారని వివరించారు. అతను బదిలీపై వెళ్లి పోయారు తప్ప తమకు న్యాయం జరగలేదన్నారు. న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

చికిత్స లోపంపై ఫిర్యాదు

ఆమదాలవలస పట్టణం లోని లక్ష్మీనగర్‌కు చెందిన యువకుడు కృష్ణసాయి 2024లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలికి బలమైన గాయం కావడంతో శ్రీకాకుళం లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో రూ.లక్షలు ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సుగర్‌ వ్యాధి పరీక్షలు చేయ కుండానే నిర్లక్ష్యంగా శస్త్రచికిత్స చేయడంతో ఇన్‌ ఫెక్షన్‌కు గురయ్యాడు. ఆ తరువాత కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉందని, మరో రూ.15 లక్షలు చెల్లిస్తే ఆపరేషన్‌ చేస్తామని చెప్పడంతో నిర్ఘాం తపోయాడు. విశాఖపట్నంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయి తే మరిన్ని ఆపరేషన్లు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యాడు. అంత కుముందు శ్రీకాకుళంలో సర్జరీ చేసిన ఆ కార్పొరేట్‌ ఆసుపత్రిపై ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ట్రస్టు వారు బాధితుడు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అమరావతికి పిలిచి విచారించి వైద్యుల నిర్లక్ష్యం ఉందని ధ్రువీకరించారు. బాధితునికి రూ.8.5 లక్షలు చెల్లించాలని, తదుపరి చికిత్సలకు అయ్యే ఖర్చు ఆసుపత్రి యాజమాన్యమే భరించాలని ఆదేశించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఆసుపత్రి వారు స్పందిం చడం లేదని బాధితుడు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని, మెరుగైన చికిత్స అందించేలా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించాలని ఆయన కోరాడు.

Updated Date - Jun 22 , 2026 | 11:56 PM