అర్జీలను పరిష్కరించండి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:19 AM
మీకోసంలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి కోరారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మీకోసంలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి కోరారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిం చిన ప్రజాఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆమె డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 102 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్‌లపై తహసీ ల్దార్లు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జయ దేవి, శ్రీకాకుళం,టెక్కలి, పలాస ఆర్డీవోలు వెంకటేష్, కృష్ణమూర్తి,సాయి ప్రత్యూ ష పాల్గొన్నారు. కాగా పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని శ్రీకాకుళం మండలంలోని కిల్లిపాలెం గ్రామానికి చెందిన రెడ్డిరాజులు కోరింది. రెండేళ్లకిందట ఆరోగ్యశ్రీలో వెన్నుపూసకు ఆపరేషన్‌చేయించుకోగా ఫెయిల్‌కావడంతో దివ్యాంగురాలిగా మా రినట్లు పేర్కొంది. ఈమేరకు సోమవారం జడ్పీలో జరుగుతున్న గ్రీవెన్స్‌లో అధికారులకు రాజులు వినతిపత్రం సమర్పించారు.