పెండింగ్ సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:46 PM
ww
పలాసరూరల్, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగులు కోరారు. మంగళవారం పలాస తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఏపీజేఏసీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు భాగ్యలక్ష్మి, రవికుమార్, అమర నాథ్, ఖగేశ్వరరావు, సునంద పాల్గొన్నారు.