Share News

విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:04 AM

పలాస నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ధమీమ్‌ అన్సారియాకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం కోరారు.

 విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష
డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే శిరీష :

పలాస, జూలై 7(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ధమీమ్‌ అన్సారియాకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం కోరారు. ఈమేరకు మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శిరీష విలేకరులతో మాట్లాడుతూ పలాస మున్సిపాలిటిలో క్రీడా కారులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించి ప్రోత్సహించేందుకు గాను మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మందస మండలం బుడార్సింగి ప్రాంతానికి చెందిన 81 మంది గిరిజన విద్యార్థులు ప్రతి రోజు 8 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. ఆ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హాస్టల్‌ ప్రాంగ ణంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Jul 08 , 2026 | 12:04 AM