అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:02 AM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను నిర్వహించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 99 అర్జీలను స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా.. ‘మా వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుపడు తున్నారని, దీంతో జీవనా ధారం కోల్పోతున్నామని తగు చర్యలు తీసుకోవాలని హిరమండలం మండలం పిండ్రువాడకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు కరణం పద్మనాభం కోరారు.
రీసర్వే మళ్లీ చేసి ఆదుకోవాలని హిరమండలం మండలం అవలంగి గ్రామస్థులు కోరారు. బొమ్మికలో కొత్తువాళ్ల మెట్టపై 20 ఏళ్లుగా వ్యవ సాయం చేసుకుంటున్నామని, ప్రభుత్వం అర్హులుగా గుర్తించి పత్రాలు మంజూరుచేసిందని, అయితే రీసర్వేలో ఈ మెట్టను చెరు వుగా చూపించారని, రీసర్వే చేసి ఆదుకోవాలని తొమ్మిది మంది రైతులు కోరారు.
మాకు పరిశ్ర మలు వద్దని, మా భూముల్లోనే సాగు చేసుకుని బతుకుతామని పొందూరు మండలం తండ్యాం గ్రామస్థులు వేడుకున్నారు. డి.పట్టాగా ఇచ్చిన భూముల్లో 45 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని, అయితే ప్రస్తుతం వాటిలో పరిశ్రమలు పెడ తామని, భూములను ఖాళీ చేయాలని సచివాలయంలో నోటీసు పెట్టార ని, తగు చర్యలు తీసుకుని న్యాయం చేయా లని గ్రామ రైతులు కోరారు.
రెవెన్యూ క్లినిక్‌లో..
రెవెన్యూ క్లినిక్‌లో వచ్చే ఫిర్యాదులు రీ-ఓపెన్ కాకుండా కచ్చితమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమ వారం జడ్పీ సమావేశ మందిరంలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల తక్షణ, కచ్చితమైన పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిం చారు. ఈసం దర్భంగా అర్జీదారులతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఏవైనా సందేహాలుంటే జేసీ, డీఆర్వో, ఆర్డీవో అందుబాటులో ఉంటారని, వారి వద్దకు వెళ్లి సందేహాలు నివృత్తి చేసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ఎటువంటి ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
నేతాజీ బీచ్ అభివృద్ధికి సహకరించండి
సోంపేట రూరల్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎర్రముక్కాం నేతాజీ బీచ్ అభివృద్ధికి సహకరించా లని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూరాడ చంద్రమోహన్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను జడ్పీ సమావేశం మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతం ఉన్నా ఎర్ర ముక్కాం బీచ్‌లో 500 మీటర్ల నల్లని రాళ్లు మరెక్కడా లేవన్నారు. ఇప్పటికే తీరానికి నలువైపులా రింగ్ రోడ్లు, సోలార్ దీపాలు ఏర్పా టుకు నిధులు మంజూరు చేసినందున పర్యాటక అభివృద్ధికి మరిన్ని సదు పాయాలు కల్పించాలని కోరారు.