Share News

అర్జీదారులు సంతృప్తి చెందేలా వినతుల పరిష్కారం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:03 AM

ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా  వినతుల పరిష్కారం
కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి గ్రీవెన్స్‌సెల్‌ నిర్వ హిం చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 182 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 77 వినతు లు వచ్చాయి. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోండి

గార మండలం అంబళ్లవలస ఎంపీయుపీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరవు తున్నారని, దీంతో విద్యార్థుల భవిష్యత్‌ నాశనమవుతోందని, తక్షణం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఆ ఉపా ధ్యాయుని స్థానంలో మ రో టీచర్‌ని నియమించాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జర్న లిస్టులు వెళ్లకూడదంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్య క్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చందు, కార్యదర్శి ఖగేష్‌, నాయకులు దివాకర్‌, అజిత్‌, ధరణి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

పనులు పూర్తయినా చెల్లింపులు లేవు

సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీలో రూ.30 లక్షలతో కాలువల పనుల ను నీటి సంఘాల ఆధ్వర్యంలో 2024లో పూర్తి చేశామని అయితే ఇప్పటికీ బిల్లులు చెల్లిం పులు చేయ లేదని గ్రామానికి చెందిన సూరాడ ధనరాజు, ఆనందరావు తెలిపారు. కార్యా లయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని, స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Updated Date - Aug 18 , 2026 | 12:03 AM