మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:39 PM
మధ్యవర్తిత్వం ద్వారా కేసులను సత్వరం పరిష్క రించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయా ధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు.
జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా
శ్రీకాకుళం లీగల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా కేసులను సత్వరం పరిష్క రించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయా ధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మధ్యవర్తిత్తంపై ఎంపికైన న్యాయ వాదుల శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. న్యాయవాదులు తీసుకున్న శిక్షణ ద్వారా ప్రజలకు ఉపయోగ పడుతుందన్నారు. న్యాయ వాదులు ఈ మధ్యవర్తిత్వం ప్రక్రియను మరింత సమర్ధవంతంగా నిర్వహిం చేందుకు శిక్షణ దోహదం చేస్తుందన్నారు. సీనియర్ ట్రైనర్‌లు వీపీ తనకచన్, సురేష్ మధ్య వర్తి త్వంపై వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు.
అనాథలను సరైన మార్గంలో నడిపించాలి
సోంపేట, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సరైన సంరక్షణ లేక అనాథలుగా మారుతున్న వారిని సక్రమ మైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరో అదనపు కోర్టు న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో స్ట్రీట్ విల్డ్రన్స్‌డే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు వీధిన పడుతున్నారని, అటువంటి వారికి సరైన సంర క్షణ లేక నేరస్థులుగా మారుతున్నారన్నారు. అనాథలను డబ్ల్యూసీ స్కూల్‌లో గాని బాలల రక్షణ కేంద్రాల్లో జాయిన్ చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు డు ఎం.సర్వేశ్వరరావు, ఎంపీడీవో సీహెచ్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.