Share News

అసభ్యంగా ప్రవర్తిస్తే ఎదిరించండి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:48 PM

ప్రయాణ సమయాలు, తరగ తుల్లో ఎవరైనా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ చర్యను గట్టిగా ఎదిరించాలని న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు విద్యార్థినులకు సూచించారు.

అసభ్యంగా ప్రవర్తిస్తే ఎదిరించండి

శ్రీకాకుళం లీగల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రయాణ సమయాలు, తరగ తుల్లో ఎవరైనా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ చర్యను గట్టిగా ఎదిరించాలని న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు విద్యార్థినులకు సూచించారు. బుధవారం ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డులో ఉన్న ఆర్సీఎం సెయింట్‌ జాన్స్‌ పాఠశాలలో న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 నెంబరుకు గాని, పోలీస్‌ 100, ఉచిత న్యాయసేవల నంబరు 15100 నెంబ రుకు గాని వెంటనే ఫోన్‌ చేయాలన్నారు. ఆడపిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల ను వివరించారు. క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని కోరారు. ఆడపిల్లల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరాప్రసాద్‌, సిస్టర్‌ జ్యోత్స్న, టి.సుమాంజలి పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:48 PM