శ్రీకాకుళం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:28 AM
నగరపాలక సంస్థ ఎన్నికల సమరానికి ముందస్తు ప్రక్రియ వేగవంతమైంది. కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు సంబంధించి వివిధ సా మాజిక వర్గాలకు కేటాయించే సీట్ల రిజర్వేషన్ విధానం ఖరారైంది.
అఖిలపక్షాల ఆమోదంతో ఓటర్ల తుదిజాబితాకు గ్రీన్‌సిగ్నల్
వివరాలు వెల్లడించిన నగ పాలక సంస్థ కమిషనర్
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల సమరానికి ముందస్తు ప్రక్రియ వేగవంతమైంది. కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు సంబంధించి వివిధ సా మాజిక వర్గాలకు కేటాయించే సీట్ల రిజర్వేషన్ విధానం ఖరారైంది. పుర పరిపాలనా విభాగం సంచాలకులు విడుదల చేసిన ఈ రిజర్వేషన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా కార్పొరేషన్ కమి షనర్ శ్రావణ్‌కుమార్ శుక్రవారం అధి కారిక ప్రకటన విడుదల చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను సద్ధం చేశారు. ఈ జాబితాకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఆమోదం లభించిందని కమిషనర్ శ్రావణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ తుది జాబితా ఆధారంగా పుర పరిపాలన డైరెక్టర్ సూచించిన రిజర్వేషన్ల విధానం ప్రకారం సీట్లు కేటాయింపు జరి గింది. 60 డివిజన్‌లకు గాను అత్యధికంగా బీసీలకు 23 స్థానాలు రిజర్వ్ కాగా. జనరల్ మహిళకు 16, ఎలాంటి రిజర్వేషన్ లేని అన్ రిజర్వ్‌డ్ (ఓపెన్) కేటగిరీకి 14 స్థానాలు దక్కాయి. ఈ మేరకు ఎస్టీ ఒక స్థానం (జనరల్), ఎస్సీ ఆరు స్థానాలు (జనరల్, 3, మహిళలు 3), బీసీ 23 స్థానాలు (జనరల్ 12, మహిళలు 11), మహిళా జనరల్ 16 స్థానాలు, అన్ రిజర్వ్‌డ్ 14 స్థానాలు కేటాయించారు.