అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:05 AM
ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌ను జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌ను జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వరి నుంచి 164 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన సమాచారంతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. కార్యక్ర మంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఉప కలెకర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వినతులు ఇలా..
‘తాగునీరు లేక అల్లాడుతున్నాం’
తాగునీరు లేక అల్లాడుతున్నామని, తగు చర్యలు తీసుకుని ఆదుకోవాలని శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు వద్ద ఉన్న జాడపేట గ్రామ మహిళలు వేడు కున్నారు. ఈమేరకు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి కలెక్టర్‌కు విన తిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలో కుళా యిలు, మంచినీటి సదుపాయం కల్పించారన్నారు. అనం తరం వచ్చిన వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వహించా రన్నారు. బోర్లు పాడయ్యాయని, నీటి ట్యాంకుకు 10 రోజులకు ఒకసారి నింపుతున్నారని ఆయన దృష్టికి తీసు కువెళ్లారు. తక్షణం చర్యలు తీసుకుని తాగునీటి సరఫరాను పునరుద్ధ రించాలని వేడుకున్నారు.
‘పనులు చేయకుండా నిధులు స్వాహా చేస్తున్నారు’
గ్రామంలో ఎటువంటి పనులు చేయకుండా దొంగ లెక్కలు చూపించి పంచాయతీ నిధులు స్వాహా చేస్తు న్నారని కోటబొమ్మాళి మండలం రేగులపాడు పంచా యతీకి చెందిన యువకులు ఫిర్యాదు చేశారు. ఈ మేర కు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చెత్తను డంపిం గ్ యార్డుకు తరలించకుండా చెరువు వద్ద వేసి చెరు వును కప్పి ఆక్రమణలకు పాల్పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదన్నారు. తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
‘రీసర్వేలో భూములను మార్చేశారు’
తరతరాలుగా భూములను సాగుచేసుకుంటూ బతు కుతున్నామని, అయితే హఠాత్తుగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఈ భూములు వారివంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేసి రీసర్వేలో వారి పేర్లపై మార్చుకున్నారని, తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని సోంపేట మండలం, కొర్లాం గ్రా మానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మేం సాగుచేస్తున్న భూముల్లోనే 5 ఎకరాల్లో విద్యుత్ సబ్ స్టేషన్, 150 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించి అడంగల్, బీ కాపీలు రావడం లేదని గతంలో జరిగి అవకతవకలపై విచా రించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.