గుర్తు తెలియని వ్యక్తుల సమాచారమివ్వండి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:00 AM
తీరప్రాంతం వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోస్టల్ సెక్యూరీటీ ఎస్‌ఐ జి.హరికృష్ణారావు కోరారు.
-కోస్టల్ సెక్యూరిటీ ఎస్‌ఐ హరికృష్ణారావు
రణస్థలం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తీరప్రాంతం వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని కోస్టల్ సెక్యూరీటీ ఎస్‌ఐ జి.హరికృష్ణారావు కోరారు. శనివారం రాత్రి చీకటిపేటలో పల్లెనిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ.. అనుమానిత వ్యక్తులు, తీవ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తుల ప్రమాదాలు, బాలికల అక్రమ రవాణా కేసులపై వివరించారు. ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు తీరం వెంబడి రవాణా అయితే కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టోల్ ఫ్రీ 93929 14712 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
వజ్రపుకొత్తూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సముద్ర తీర ప్రాంతాల్లో అపరిచితులు సంచరిస్తే సమాచారం అందించాలని బావనపాడు మెరైన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలో గ్రామస్థు లతో మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవిందపాపారావు పాల్గొన్నారు.