పొన్నాంలో ప్రశాంతంగా రీ పోలింగ్
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:40 PM
మండలంలోని పొన్నాం గ్రామం-2 నెంబర్ పోలింగ్ కేంద్రంలో శుక్రవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పొన్నాం గ్రామం-2 నెంబర్ పోలింగ్ కేంద్రంలో శుక్రవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 70.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రం పరిధిలో మొత్తం 932 మంది ఓటర్లు ఉండగా 655 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 316 మంది పురుషులు, 339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యల తరలివచ్చి ఓటు వేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను పకడ్బందీగా సీల్ చేసి ఎచ్చెర్ల మండలం చిలకపా లెంలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల స్ర్టాంగ్ రూమ్‌కు తరలించారు. శనివారం ఉదయం 8 గంటలకు బ్యాలెట్లను లెక్కించనున్నారు.