ఆమదాలవలసలో 28 వార్డుల పునర్విభజన
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:47 PM
ఆమదాలవలస మునిసిపాలిటీలో 28 వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదనలను కమిషనర్ తమ్మినేని రవి శుక్రవారం విడుదల చేశారు.
అభ్యంతరాలు, సూచనలకు 14 వరకు గడువు
కమిషనర్ రవి
ఆమదాలవలస, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస మునిసిపాలిటీలో 28 వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదనలను కమిషనర్ తమ్మినేని రవి శుక్రవారం విడుదల చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముసా యిదా ప్రతులను శ్రీకాకుళం ఆర్డీవో, ఆమ దాలవలస తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, పుర పాలక సంఘం కార్యాలయంతో పాటు పట్టణం లోని అన్ని సచివాలయాల్లో ఉంచుతున్నా మన్నా రు. ఈ ప్రతిపాదనలపై ప్రజలు అభ్యంతరాలు, సూచనలను ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలన్నారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలు, సూచన లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. కార్యక్ర మంలో మునిసిపల్ ఆర్‌ఐ తమ్మినేని అమర్‌నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.