Share News

మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించండి

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:40 PM

వర్షాకాలం రానున్న నేపథ్యంలో మిర్తిబట్టి కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తక్షణమే తొలగించాలని అధికారులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శ్రీకాకు ళంలోని కొత్తరోడ్డు నుంచి రామలక్ష్మణజంక్షన్‌ వరకు ప్రధాన పంటకాలువ మిర్తి బట్టిపై సాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు.

మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించండి
మిర్తిబట్టి పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం రానున్న నేపథ్యంలో మిర్తిబట్టి కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తక్షణమే తొలగించాలని అధికారులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శ్రీకాకు ళంలోని కొత్తరోడ్డు నుంచి రామలక్ష్మణజంక్షన్‌ వరకు ప్రధాన పంటకాలువ మిర్తి బట్టిపై సాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురు వారం మిర్తిబట్టిని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ కూర్మారావు, స్థానిక పెద్దలతో కలిసి పరిశీలించారు. ఆక్రమణల నిరోఽధానికి కాలువ పొడవునా లైనింగ్‌ వేయాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా అవరసరమైన చోట్ల నూతన కల్వర్టులను నిర్మించాలని నిర్ణయించారు. ఆధునిక సాంకేతికతో మిర్తిబట్టిని పునరుద్ధరించాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. నగరంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేక్రమంలో ఈ బట్టి ఆధునికీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుం టున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక నిధులతోపాటు, అమృత్‌ పథకం కింద నగ రానికి కేటాయించిన నిధులను వినియోగించనున్నారు. ప్రజల ఆరోగ్యం, నగర సుంద రీకరణ విషయంలో రాజీపడేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆక్రమణదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తాగునీటి నాణ్యతపై రాజీపడే ప్రసక్తే లేదు: కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టర్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): నగర ప్రజలకు సరఫరా చేసి తాగునీటి నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో తాగునీటి సరఫరా, సచివాలయాల పరిధిలోని మౌలిక వసతుల కల్పనపై గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ హనుమంతు కూర్మారావులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగావళి నది నుంచి సరఫరా అవుతున్న తాగునీటి శుద్ధి ప్రక్రి యను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. నగరంలోని 15 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిరంతరం పరిశుభ్రంచేయాలని కోరారు. ప్రస్తుతమున్న 140 కిలోమీటర్ల పంపిణీ వ్యవస్థ, 21,447 కుళాయి కనెక్షన్ల ద్వారా రోజుకు మూడు గంటల పాటు అందిస్తున్న తాగునీటి సరఫరాపై ఆరాతీశారు. నగరంలో పెద్దపాడు, గాంధీనగర్‌, ఎస్పీకాలనీ, తంగివానిపేట, ముద్దాడపేట, తోటపాలెం విలీన ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను రోజూ పరిశీలించాలన్నారు. లక్ష్యాల మేరకు నీటి శాంపిళ్లను సేకరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయాల పరిధిలో రూ.80లక్షలతో మంజూరైన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 04 , 2026 | 11:40 PM