‘గుండ’ విగ్రహ దిమ్మల తొలగింపు
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:38 PM
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటుకు గాను దిమ్మలను నిర్మించగా వాటిని మంగళ వారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధి కారులు తొలగించారు.
ఆవేదనకు గురైన అభిమానులు
అరసవల్లి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటుకు గాను దిమ్మలను నిర్మించగా వాటిని మంగళ వారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధి కారులు తొలగించారు. దీంతో ఆయన అభి మానులు ఆవేదనకు గురయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విధేయుడిగా ఉంటూ నీతి, నిజాయితీతో ఉన్న అప్పల సూర్యనారా యణ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలకు విశేష సేవ లు అందించిన అప్పలసూర్యనారాయణ విగ్రహాలు ఏర్పాటుకు అనుమతించాలని ఆమె, కుమా రుడు సీఎం చంద్రబాబునాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రాలిచ్చారు. వారం కిందట ఏడురోడ్ల కూడలి, అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన దిమ్మలను మంగళవారం సిబ్బంది తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.