Share News

ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:38 PM

పాత ఆమదాలవలస రెవెన్యూ గ్రామంలో ఆక్రమణకు గురైన ఆర్‌అండ్‌బీ స్థలాన్ని అధికారు లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు
ఆక్రమిత స్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసులు

ఆమదాలవలస, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పాత ఆమదాలవలస రెవెన్యూ గ్రామంలో ఆక్రమణకు గురైన ఆర్‌అండ్‌బీ స్థలాన్ని అధికారు లు స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికా రులు పోలీసుల సహకారంతో ఆక్రమిత స్థలాన్ని పరిశీలించి అందు లో ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించారు. ఆర్‌అండ్‌డీ డీఈ గణపతిరావు, తహసీల్దార్‌ బి.సత్యం ఆధ్వర్యంలో సర్వే నెంబర్‌ 20-2 బిలో ఉన్న ఎకరా ఐదు సెంట్లు భూమిలో 14 సెంట్లు రోడ్లు భవనాలశాఖకు చెందిన స్థలం ఉన్నట్టు గుర్తించారు. సదరు స్థలం చుట్టూ భూ యజ మాని సరిహద్దు కంచె ఏర్పాటు చేయగా దానికి అధికారులు తొలగించారు. ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమణల తొలగింపు విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని అధికారుల ను ప్రశ్నించగా ఎస్‌ఐ సనపల బాలరాజు ఆధ్వ ర్యంలో వారిని వారించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారైనా చర్యలు చేపట్టడం ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు తెలిపారు. జేఈ నాయక్‌ రెవెన్యూ , పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:38 PM