Share News

జలుమూరులో ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - May 18 , 2026 | 11:28 PM

జలుమూరులో రోడ్డుకు ఇరువైపుల గల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు సోమవారం తొలగించారు.

జలుమూరులో ఆక్రమణల తొలగింపు
ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు :

జలుమూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): జలుమూరులో రోడ్డుకు ఇరువైపుల గల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు సోమవారం తొలగించారు. వ్యాపారులు తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలను ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తుండడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామానికి చెందిన కోలా తిరుపతిరావు, విశ్రాంతి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారని, దీంతో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలు తొలగించినట్లు తహసీల్దార్‌ జె.రామారావు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జగదీష్‌, వీఆర్వోలు అర్జునరావు, రామారావులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:28 PM