కరజాడలో ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:43 PM
శ్రీకాకుళం మండలంలోని కరజాడలో యాభైఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు విముక్తి లభించింది. కరజాడ నుంచి వంశధార నది వరకు పది అడుగుల రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణానికి దశాబ్దాల తరబడిగా ప్రయత్నిస్తున్నారు.
శ్రీకాకుళం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలంలోని కరజాడలో యాభైఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు విముక్తి లభించింది. కరజాడ నుంచి వంశధార నది వరకు పది అడుగుల రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా కాలువల నిర్మాణానికి దశాబ్దాల తరబడిగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది సహకరిం చకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఈవిషయంపై స్పందించారు. రూ.కోటీ 60 లక్షలు ప్రభుత్వం నుంచి తెప్పించారు. ఇందుకోసం కలెక్టర్‌ను ఒప్పించి పనులు మంజూరయ్యేలా చేశారు. అయితే రోడ్డు, కాలువపనులు కొంతవరకే జరిగాయి.పూర్తిస్థాయిలో పనులు జరగ నివ్వకపోవడం, ప్రభుత్వానికి చెందిన స్థలాన్నే కొందరు ఆక్రమించుకుని ఆ స్థలా న్ని విడిచిపట్టేందుకు ఇష్టపడడం లేదు. ఈనేపథ్యంలో గురువారం పోలీసులు, రెవెన్యూ, మండలపరిషత్ అధికారులు కరజాడ-వంశధార నదిరోడ్డులో ఉన్న ఆక్రమణలు తొలగించేశారు. గ్రామస్థులు అంగీకరించి ఆక్రమణల తొలగింపునకు అధికారులకు సహకరించారు. దీంతో నది వరకు గ్రామం నుంచి పది అడుగుల వెడల్పుతో ఇరువైపులా కాలువల నిర్మాణంతో రోడ్డు ఏర్పాటుకానుంది.