ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:53 PM
చిలకపాలెం, నవభారత్, సింహద్వారం ప్రాంతం లో జాతీయ రహదారి ప్లై ఓవర్ కింద ఆక్రమణ లను ఆదివారం ఎన్‌హెచ్‌ఏఐ, పోలీసులు యం త్రాల సాయంతో తొలగించారు.
ఎచ్చెర్ల రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): చిలకపాలెం, నవభారత్, సింహద్వారం ప్రాంతం లో జాతీయ రహదారి ప్లై ఓవర్ కింద ఆక్రమణ లను ఆదివారం ఎన్‌హెచ్‌ఏఐ, పోలీసులు యం త్రాల సాయంతో తొలగించారు. రోడ్డును ఆక్ర మించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ, టిఫిన్ స్టాల్‌లు ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయని వాహనచోదకుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అధికారులు ఆక్రమణలను తొలగించారు.
పొందూరులో..
పొందూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ పొందూరులో ప్రధాన కాలువలో సిల్ట్ పేరుకుపోయి మురికి నీరు రోడ్లపైకి వస్తుం డడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడు తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపక్క కాలువలను ఆక్రమించిన వారిపై పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. కాలువపై ఉన్న ఆక్రమ ణలను తొలగించి పూడికలను తొలగించే ప్రక్రి య చేపట్టారు. పంచా యతీ ఈవో పొన్నాడ జగ దీష్ ఆధ్వర్యంలో కాలువలోని నీరు సజావుగా పారేలా చర్యలు తీసుకున్నారు.