ఆదిత్యాలయ వంట మాస్టర్ తొలగింపు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:05 AM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నిత్యాన్నదానం వంటశాలలో విధులు నిర్వహిస్తున్న వంట మాస్టర్ శర్మను విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ చర్యలు తీసుకున్నారు.
మద్యం సేవించి విధులకు హాజరవడంతో ఈవో చర్యలు
అరసవల్లి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నిత్యాన్నదానం వంటశాలలో విధులు నిర్వహిస్తున్న వంట మాస్టర్ శర్మను విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి, తూ లుతూ వంట చేస్తున్న దృశ్యాలను సీసీ కెమెరాలో చూసి తన కార్యాల యానికి పిలిపించి విచారించారు. మద్యం మత్తులోనే రావడం, అలాగే వంట సరుకులను కూడా బయటకు తరలిస్తున్నట్లు సీసీ కెమె రాల్లో న మోదు కావడంతో అతడిని తక్షణం విధుల నుంచి తొలగించారు. అలాగే ఈవో నిర్వహించిన తని ఖీల్లో పోటులో మద్యం సీసాలు కూడా బయట పడినట్లు తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో నిర్వహించాల్సిన స్టోర్ రూమ్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడంతో ఈ అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం.