Share News

జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:27 AM

మండలంలోని అంపోలు సమీపంలో ఉన్న జిల్లా జైలులో భుక్త బలరాం (27) అనే రిమాండ్‌ ఖైదీ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

 జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య
బలరాం మృతదేహం

గార, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంపోలు సమీపంలో ఉన్న జిల్లా జైలులో భుక్త బలరాం (27) అనే రిమాండ్‌ ఖైదీ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గార ఏఎస్‌ఐ టి.చంద్రమోహన్‌, జైలు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇచ్ఛాపురం రూరల్‌ మండలం కేదారిపురం గ్రామానికి చెందిన బలరాం గంజాయి కేసులో పట్టుబడ్డాడు. మేజిస్ర్టేట్‌ ఆదేశాల మేరకు ఈ నెల 6న ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసులు బలరాంను జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న బలరాం మంగళవారం రాత్రి బేరక్‌లో ఉన్న బాత్‌రూంలో కిటికీ గజాలకు తువ్వాలతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అతనిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బలరాం మార్గమధ్యలోనే చనిపోయినట్టు రిమ్స్‌ వైద్యులు పేర్కొన్నట్టు ఎస్‌ఐ చంద్రమోహన్‌, జైలు సిబ్బంది తెలిపారు. జైలు సూపరింటెండెంట్‌ జి.మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ఆర్డీవో సాయి ప్రత్యూష, ఏఎస్‌ఐ చంద్రమోహన్‌, జైలు సూపరింటెండెంట్‌ మధుబాబు బుధవారం జిల్లా జైలులో ఉన్న తోటి రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:30 AM