తుఫాన్ ప్రభావం తగ్గేవరకూ అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:15 AM
తుఫాన్ ప్రభావం తగ్గే వరకే పోలీసుఎ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావం తగ్గే వరకే పోలీసుఎ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు జిల్లాలో రహదారులపై పడిన చెట్లను పోలీసు సిబ్బంది బుధవారం తొలగించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తూరు, సోంపేట, మందస, కవిటి పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసులు అప్రవ ుత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. వర్షాల కారణంగా రహదారులపై నీరు చేరినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాతా వరణ పరిస్థితులను గమనిస్తుండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలను నదులు, కాలువలు, వాగులు, నీరు నిలిచిన ప్రాంతాల వద్దకు వెళ్లనివ్వవ ద్దన్నారు. వృద్ధులు, దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్నవారిని అవసరమైన ప్పుడు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తర లించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.