ఆర్టీఐ చట్టం ఉల్లంఘన కేసులో ఇద్దరికి ఊరట
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:29 AM
సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.
శ్రీకాకుళం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వారిపై క్రమశిక్షణా చర్యలను ఉపసంహరిం చుకుంటూ గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు చెందిన పబ్లిక్ ఇన్ఫర్మే షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎస్.వెంకటేశ్వరరావు, ఫస్ట్ అప్పీలేట్ అథా రిటీ, అసిస్టెంట్ కమిషనర్ వైవీ శివకుమార్‌పై ప్రభుత్వం ఈ చర్యలను నిలి పివేసింది. వారిద్దరూ ఆర్టీఐ చట్టం నిబంధనలను, రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించారు. కమిషన్ ముందు హాజరు కాలేదు. అలాగే 2025 మే 6, జూన్ 11, జూలై 7 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదు. వీరిపై గతంలో ఏపీపీఎస్ నిబంధనల కింద ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు ప్రారం భించింది. దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వడంలో జాప్యం వాస్తవమే. కానీ గ్రామ పంచాయతీ నుంచి రికార్డులు అందకపోవడం, దరఖాస్తుదారుడు స్పష్ట మైన వివరాలు అడగకపోవడం, పని ఒత్తిడి, సెక్షన్ స్థాయిలో విధానపరమైన లోపాల వల్లే ఈ తప్పు జరిగిందని అధికారులు తమ లిఖితపూర్వక వివరణలో ప్రభుత్వానికి నివేదించారు. ఈ వ్యవహారంలో సమాచార కమిషన్ అప్పటికే ఆర్టీఐ చట్టం, 2005లోని సెక్షన్ 20(1) కింద ఇద్దరు అధికారులకు చెరో రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అధికారులు ఇప్పటికే జరిమానా చెల్లిం చడం, జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేయమడం, దీనిని తొలితప్పుగా పరిగణించి వదిలేయాలని కోరడంతో ప్రభుత్వం వారి అభ్యర్థనపై సానుకూలం గా స్పందించింది. ఏపీసీఎస్ రూల్స్ కింద వీరిపై తదుపరి చర్యలను ఉప సంహరించుకుంది. భవిష్యత్తులో ఆర్టీఐ దరఖాస్తుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, సమాచార కమిషన్ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.