Share News

సీదిరి అప్పలరాజుకు ఊరట

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:34 AM

Sompeta court grants bail కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు (ఏ3)కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సోంపేట కోర్టు న్యాయాధికారి కోడూరు కిషోర్‌బాబు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.

సీదిరి అప్పలరాజుకు ఊరట
జిల్లా జైలు నుంచి వస్తున్న వైసీపీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు

  • షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సోంపేట కోర్టు

  • సాక్షులను ప్రభావితం చేయవద్దని న్యాయస్థానం ఆదేశం

  • శ్రీకాకుళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు (ఏ3)కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సోంపేట కోర్టు న్యాయాధికారి కోడూరు కిషోర్‌బాబు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.

  • కోర్టు విధించిన ప్రధాన షరతులు

  • రూ.25000 సొంత పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పూచీకత్తులను సమర్పించాలి. కేసు విచారణకు సంబంధించి సాక్షులను బెదిరించడం గానీ, ప్రలోభాలకు గురిచేసి ప్రభావితం చేయరాదు. కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసేవరకు లేదా రెండు నెలల పాటు (ఏది ముందైతే అది) ప్రతినెలా మొదటి, మూడో ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలి.

  • జిల్లా జైలు నుంచి సీదిరి విడుదల...

  • శుక్రవారం సాయంత్రం అంపోలు జైలు నుంచి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. అనంతరం అప్పలరాజు.. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి చేరుకున్నారు. ధర్మానతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘నాకు. నా కొడుకుకు కష్ట కాలం. మా అధినేత జగన్‌ నాకోసం వచ్చారు. చాలా గర్వంగా ఫీలవుతున్నా. జిల్లా పోలీసులు తప్పుడు కేసులు పెట్టలేదు సహాయమే చేశారు. కానీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష పెట్టుకుంది. తప్పుడు కేసులు పెట్టించారు’ అని సీదిరి తెలిపారు.

Updated Date - Aug 15 , 2026 | 12:34 AM