ఏసీబీ కేసులో రిటైర్డ్ ఈఈకి ఊరట
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:04 AM
శ్రీకాకుళం పంచాయతీరాజ్ విభాగంలో గతంలో విధులు నిర్వర్తించి, అవినీతి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొన్న ఇద్దరు ఉద్యోగుల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ అసిస్టెంట్‌కు ఇంక్రిమెంట్ కోత
శ్రీకాకుళం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం పంచాయతీరాజ్ విభాగంలో గతంలో విధులు నిర్వర్తించి, అవినీతి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొన్న ఇద్దరు ఉద్యోగుల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి పీఆర్ ఈఈ (ప్రస్తుతం రిటైర్డ్) జీఎస్సార్ గుప్తా పై వచ్చిన ప్రధాన ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆయనపై తదు పరి క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించింది. అదే కార్యాలయంలో పని చేసిన సీనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మిపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోప ణలు పాక్షికంగా రుజువు కావడంతో ఆమెకు ఒక ఇంక్రిమెంట్ కోత విధి స్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం వేర్వేరుగా జీవోఆర్టీ నెంబర్ 789, 788లను విడుదల చేశారు.
రిటైర్డ్ ఈఈ గుప్తాకు క్లీన్‌చిట్
శ్రీకాకుళం పీఆర్‌ఐ డివిజన్ ఈఈగా పనిచేసిన జీఎస్సార్ గుప్తా తన పై వచ్చిన ఆరోపణల పరిష్కారం కోసం నకిలీ ఏసీబీ అధికారులకు నవంబరు 2019లో రూ.50 వేలు చెల్లించారన్నది ప్రధాన అభియోగం. అలాగే కార్యాలయ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సరిగాలేదని మరో ఆరోపణ. 2018, 2019 సంవత్సరాలకు సంబం ధించి వార్షిక ఆస్తుల వివరాలు సమర్పించలేదని, భార్య పేరిట నరసన్నపేటలో స్థిరాస్తి కొను గోలుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని. తనిఖీ సమయంలో తన వద్ద ఉన్న రూ.13,690లకు లెక్కలు చూపలేదని ఏసీబీ అభియోగాలు మోపింది. దీనిపై వారి నివేదిక ఆధారంగా ప్రభుత్వం విశాఖపట్నం పీఆర్ ఎస్‌ఈ కె.శ్రీనివా సరావును విచారణాధికారిగా నియమించింది. విచారణలో మొదటి రెండు ఆరోపణలు రుజువు కాలేదని తేలింది. మూడో ఆరోపణ పాక్షికంగా రుజువైనప్పటికీ ఏసీబీ తనిఖీ సమయానికే 2017 వరకు ఆయన ఆస్తుల వివరాలు సమర్పించారని, మిగిలిన రెండేళ్ల వివరాలు కూడా ఆ తర్వాత అందించారని ప్రభుత్వం గమనించింది. దీని ని పరిగణనలోకి తీసుకుని ఆయనపై తదుపరి చర్యలను ఉపసంహ రిస్తూ జీవో 789 విడుదల చేసింది.
ఇదే పీఆర్‌ఐ డివిజన్ కార్యాల యంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన బి.లక్ష్మిపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం కింద అభియోగాలు నమోదయ్యాయి. అటెండెన్స్ రిజిస్టర్‌తో పాటు ముఖ్యమైన ‘స్పందన’ నివేదికల కరస్పాండెన్స్‌ను నిర్వహించ డంలో ఆమె విఫలమయ్యారని ఏసీబీ నివేదించింది. దీనిపై జరిగిన విచారణలో ఆరోపణలు పాక్షికంగా రుజువైనట్లు విచారణాధికారి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. ఆమెకు ఎటువంటి క్యుములేటివ్ ఎఫెక్ట్ లేకుండా ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపివేస్తూ జీవో 788 ఉత్తర్వులు జారీ చేసింది.