పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:41 PM
కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.
నరసన్నపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధిహామీ పనులు పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అలాగే 1959లో నిర్మించిన సారవకోట మండలపరిషత్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడం తో నిరుపయోగంగా ఉందని తెలిపారు. ఈ భవనం పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.