Share News

వేతన బకాయిలు విడుదల

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:57 PM

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్‌ వాచ్‌మెన్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసింది.

 వేతన బకాయిలు విడుదల

ఆయాలు, నైట్‌ వాచ్‌మెన్‌ల ఖాతాల్లో జమ

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

పొందూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్‌ వాచ్‌మెన్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసింది. ఈనెల 27న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వేతనాలందక చిరుద్యో గుల అవస్థలు’ శీర్షికతో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. జిల్లాలో పనిచేస్తున్న 2763 మంది ఆయాలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు చొప్పున 4,97,34,000, సు మారు 400 మంది నైట్‌వాచ్‌మెన్‌లకు ఒక్కొక్కరికి రూ.42 వేలు చొప్పున రూ.1.68 కోట్లు మేరకు మంజూరు చేశారు. ఆయాలకు 4 నెలలకు, నైట్‌ వాచ్‌మెన్‌లకు 7 నెలలకు సంబంధించిన బకాయిలు విడుదల చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు వారంతా కృత జ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 28 , 2026 | 11:57 PM