క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:00 AM
నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామం భాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ముగిసిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా సంబరాలు
శ్రీకాకుళం/స్పోర్ట్స్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామం భాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా చేపట్టిన ఉద్యో గుల క్రీడా, సాంస్కృతిక పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు మంత్రి అచ్చెన్నాయుడు బహుమతు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య రెవెన్యూ వ్యవస్థ ఒక వారధి లాంటిదన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్క రించి రెవెన్యూ శాఖ గౌరవాన్ని మరింత పెంపొందించాలని అధికారు లకు, సిబ్బందికి సూచించారు. చిన్న పనుల కోసం సైతం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిర గాల్సిన అవసరం లేకుండా ‘వాట్సాప్ గవర్నెన్స్’ సేవలను ప్రభుత్వం అందు బాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. సిబ్బంది మరింత జవా బుదారీతనంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది అన్ని క్రీడా విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క రూ కొంత సమయం వ్యాయామానికి కేటాయిం చాలన్నారు. అనంతరం పలు సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు.
విజేతలు వీరే...
డిస్క్‌త్రో (45 ఏళ్లు పైబడిన)లో పి.సోమేశ్వర రావు (స్వర్ణం), జీఎల్‌ఈ శ్రీనివాసరావు (రజతం), శ్రీనివాసరావు (కాం స్యం) పతకాలు సాధించారు. షాట్‌పుట్‌లో పి.సోమేశ్వరరావు (స్వర్ణం), ఆర్. రామారావు (రజతం), ఎస్.గజపతిరావు (కాం స్యం), క్యారమ్స్ సింగిల్స్‌లో ఎన్‌ఎస్‌కే కిషోర్ (ప్ర థమ), డీవీ సీతారామయ్య (ద్వితీయ) బహు మతులు పొందారు. షటిల్ బ్యాడ్మింటన్‌లో కె.కవి కుమార్ (ప్రథమ), ఎస్.రాంబాబు (ద్వితీయ స్థానం), 100 మీటర్ల పరుగు పందెం (45 ఏళ్ల లోపు)లో ఎం.హేమరాజు (స్వర్ణం), శ్రీకాంత్ (రజతం), ప్రశాంత్ (కాంస్యం) పతకాలు పొందారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ నేతలు పి.శ్రీనివాస రావు, కె.శ్రీరాములు, వీవీఎన్ రాజు, ఐ.లింగరాజు, మురళీ నాయక్, గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.