ఆద్యంతం అలరించిన రేలారే రేలా
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:03 AM
శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య 315వ నెలవారీ సాంతిక కార్యక్రమం శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహించారు.
అరసవల్లి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య 315వ నెలవారీ సాం స్కృతిక కార్య క్రమం శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహించారు. ఉత్తరాంధ్ర పల్లె జానపదాలు రేలారే రేలా కార్యక్రమం ఆహూతులను ఆద్యంతం అలరించింది. శ్రీ విజయ జానపద కళాబృందం ఆధ్వర్యంలో, ప్రముఖ సినీ జానపద నేపథ్య గాయకుడు పి.రఘు ఆలపించిన ఉత్తరాంధ్ర పల్లె జానపదా లు, అందుకు అనుగుణంగా అభినయించిన నృత్యాలు ప్రేక్షకు లను మంత్రముగ్థులను చేశాయి. ఈ సందర్భంగా ఏపీఈపీ డీసీఎల్ ఎస్‌ఈ నగిరెడ్డి కృష్ణమూరి పౌరాణిక పద్యాలను ఆలపించి, కళాప్రియులను ఆకట్టుకు న్నారు. కార్యక్రమంలో కళాకారులు నాగరాజు, గణేష్, నిర్మల, రాణి, శంకర్ పాల్గొనగా, కీబోర్డుపై దుర్గాప్రసాద్, ప్యాడ్స్‌పై దామోదరరావు సహకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.